అభివృద్ధిలో అగ్రగామిగా వరంగల్‌- ఎర్రబెల్లి

321
Minister Errabelli Dayakar Rao
- Advertisement -

వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వరంగల్ ని చరిత్రలో నిలిచే స్థాయిలో అభివృధ్ధి చేస్తున్నాం. వరంగల్ ని అభివృద్ధిలో రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. అభివృద్ధికి వస్తున్న అడ్డంకులను తొలగిస్తున్నాం. కరోనా మహమ్మారి వల్ల అభివృద్ధిలో వెనకబడ్డాం- మరింత వేగంగా అభివృద్ధిని చేద్దామని మంత్రి తెలిపారు.

సీఎం కేసీఅర్ కరోనా సమయంలో రాష్ట్రంలో తీసుకున్న చర్యలు అధ్బుతంగా పని చేశాయని.. ఎంజిఎంకి మరిన్ని నిధులు కేటాయించి ప్రజలని కాపాడుకుందామన్నారు. సెంట్రల్ జైలు స్థలాన్ని ఎంజీఎంకు కేటాయించి దవాఖనను మరింత అభివృద్ది చేద్దాం. ఇప్పటికే వరంగల్ అభివృద్ది ప్రణాళికలను సిద్ధం చేశాం. మాస్టర్ ప్లాన్‌లో వర్షాలకు నిండే నాలల గురించి చేర్చలేదు. మంత్రి కెటీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా మహమ్మారి,వర్షాల కారణంగా అభివృద్ది ప్రణాళికలు ఆలస్యమయ్యయి. ఇప్పుడున్న మాస్టర్ ప్లాన్ కి ఈ మధ్య ఉత్పన్నమైన సమస్యలకు పరిష్కారం చూపే విధంగా సరికొత్తగా మాస్టర్ ప్లాన్ ని తయారు చేస్తాం. గ్రేటర్ వరంగల్ నాలాల ఆక్రమణ తొలగింపు విషయంలో ప్రభుత్వం సీరియస్ గా వుందని మంత్రి స్పష్టం చేశారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తన ఇంటిని తానే స్వయంగా కుల్చుకున్నారు ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. కార్పొరేటర్ దామోదర్ ఇంటి కూల్చివేత పై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని అదేశిస్తున్నాను. కార్పొరేటర్లు అందరూ కూడా నాలాల కూల్చివేతకు సహకరించండి. నాలాల సమస్యలకు త్వరగానే పరిష్కారం చూపుతామన్నారు. మంత్రి కెటీఆర్‌తో కార్పొరేటర్లకు మీటింగ్ పెట్టి ఆయా డివిజన్లలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. మీ అందరి సహకారంతో వరంగల్ ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుదామని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.ఈ సమావేశంలో మేయర్, కమిషనర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -