అమెరికాలో తెలంగాణ గుండె చప్పుడు

215
t news america
t news america
- Advertisement -

బంగారు తెలంగాణే లక్ష్యంగా పని చేస్తున్న టీన్యూస్.. ఇకపై ప్రభుత్వ ఆశయాలను, లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పనున్నది. నేడు అమెరికాలోని న్యూజెర్సీలో టీన్యూస్‌ ఛానల్ ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి హాజరైన టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్, సీఈవో నారయణరెడ్డి, యోయో టీవీ సీఈవో మల్లారెడ్డి మంత్రి పోచారం, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎన్నారైలు జ్యోతి ప్రజ్వళన చేసి లాంఛనంగా టీ న్యూస్‌ ఛానల్ ప్రసారాలను ప్రారంభించారు.

ఈ సంధర్బంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. టీ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడని అన్నారు. ఎండీ సంతోష్ కుమార్ సారథ్యంలో టీ న్యూస్‌..  డైనమిక్ లీడర్ కేసీఆర్ ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసమే పని చేసిందన్నారు. మనం ఒక రోజు అన్నం తినకుండా ఉండగలుగుతాం.. కానీ టీ న్యూస్‌ చూడకుండా ఉండలేమని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కేవలం కేసీఆర్‌ వల్లనే సాధ్యమయిందని.. ఇపుడు మన ముందున్న లక్ష్యం తెలంగాణను బంగారు తెలంగాణ చేయడమేనని అన్నారు. అగ్రరాజ్యం అమెరికాలో టీ న్యూస్ ఛానల్‌ ప్రారంభమవడం గొప్ప విషయమని మంత్రి చెప్పారు. బంగారు తెలంగాణలో తనవంతు పాత్ర పోషిస్తున్న టీ న్యూస్.. ఇకపై తెలంగాణ గుండె చప్పుడును విశ్వవ్యాప్తంగా వినిపించనుందని అన్నారు.

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో టీ న్యూస్ కీలక పాత్ర పోషించిందన్నారు. ఇతర ఛానళ్లు తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేయగా.. టీ న్యూస్ ఒక్కటే ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిందన్నారు.

ఎమ్మల్యే గణేష్ మాట్లాడుతూ.. తెలంగాణ గుండె చప్పుడు టీ న్యూస్ ఇపుడు అమెరికాలో కూడా వినిపిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు అండగా ఉన్న టీ న్యూస్‌ ఛానల్‌ను ప్రశంసించారు. అమెరికాలో టీ న్యూస్ ఏర్పాటుకు కృషి చేసిన ఎండీ సంతోష్‌ కుమార్, యోయో టీవీ ఎండీ మల్లారెడ్డికి అభినందనలు తెలియజేశారు.

అమెరికాలో ఎన్నారైలకు వెన్నుదన్నుగా నిలిచేందుకే అమెరికాలో టీ న్యూస్ ప్రసారాలను ప్రారంభించామని టీ న్యూస్ సీఈఓ నారాయణ రెడ్డి అన్నారు. ఈ సంధర్బంగా తెలంగాణ అభివృద్దిలోనూ ఎన్నారైలు భాగస్వాములు కావాలన్నారు.

ఎన్నారైలు ఎలాగైతే తెలంగాణ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచారో.. ఇప్పుడు టీ న్యూస్ ను కూడా అలాగే వెన్నుతట్టి ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు. అమెరికాలో టీ న్యూస్ ను ప్రారంభించటంపై ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

https://youtu.be/ucVi3Tzv_ug

- Advertisement -