ముసి ప్రక్షాళన కోసం అంతర్జాతీయ అనుభవాలను ఉపయోగించుకుంటామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రెండో రోజు దక్షిన కోరియా పర్యటనలో ఉన్న మంత్రి యాంగ్‌జీసియోల్‌లో ఉన్న Cheonnggyecheon నది ప్రక్షాళన జరిగిన తీరును మంత్రి పరిశీలించి తెలుసుకున్నారు. నది ప్రక్షాళన కోసం అక్కడి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలను,పనులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. నదిని ప్రక్షాళన చేసిన అధికారుల నిబద్దతను మంత్రి ప్రశంసించారు. ప్రజల భాగసామ్యం ద్వారానే ఇంతటి కార్యక్రమం అయ్యిందని మంత్రి అక్కడి అధికారులు తెలిపారు. నది ప్రక్షాళన కోసం ఏర్పాటు చేసిన సివరేజ్ టీరీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన తీరుని కేటీఆర్ తెలుసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరం మధ్య నుండి ప్రవహించే మూసి నదిని ప్రక్షాళన చేస్తామని అందుకోసం దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తామని తెలిపారు. ప్రస్తుతం బాపు ఘాట్ వద్ద కొంత దూరాన్ని సుందరీకరణ చేస్తున్నమని తెలిపిన మంత్రి,మూసీ నదీ ప్రక్షాళన చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రపంచంలోని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన ప్రాంతాల అనుభావాలను అధారంగా పనిచేస్తామని తెలిపారు.
హనమ్ సిటీలోని యూనియన్ టవర్స్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్ అక్కడి వేస్ట్ మేనేజ్‌మెంట్ పద్దతులుపైన అధ్యాయనం చేశారు. దీంతోపాటు నగరంలో వాయు కాలుష్యం తగ్గించేందుకు చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.హైదరాబాద్ నగరంలోనూ వాయు కాలుష్యం తగ్గించేందుకు తాము ఒక అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.హైదరబాద్ నగరంలో వాయు కాలుష్యం తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. త్వరలోనే నగరంలో కాలుష్య పరిశ్రమలను తరలిస్తామని తెలిపారు.
మంత్రి కేటీఆర్ ఇవాళ దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ద డాంగ్ ఏ ఇబోకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ పత్రికకు చెందిన సీనియర్ రిపోర్టర్ ఒకరు మంత్రి కేటీఆర్‌ను ఇంటర్వ్యూ చేశారు. తెలంగాణలో పెట్టబడులు పెట్టేందుకు కొరియా కంపెనీలకు కేటీఆర్ ఆహ్వానం అందించిన అంశం తెలిసిందే. పెట్టుబడులు పెట్టే కొరియా కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. ఇవాళ మంత్రి కేటీఆర్ కొరియా కంపెనీలకు చెందిన పలువురు సీఈవోలను కూడా కలిశారు. నాంగ్‌సిమ్ ఇంజనీరింగ్ సంస్థ సీఈవో కిమ్ కీ హో, కొలన్ గ్లోబల్ కంపెనీ సీఈవో యూ చాంగ్ హూన్‌ను ఆయన కలుసుకున్నారు.