విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ వద్ద అపశృతి..

211
Kanakadurga flyover
- Advertisement -

ఏపీలో విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ వద్ద అపశృతి చోటు చేసుకుంది. అశోక పిల్లర్ సమీపంలో ఫ్లైఓవర్ నుంచి కాంక్రీట్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో ఫ్లైఓవర్ కింద విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్‌కు గాయాలు అయ్యాయి. ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌(పీసీ 2928)కు చెందిన రాంబాబు దసరా ఉత్సవాల నేపథ్యంలో బందోబస్తు కోసం ఫ్లైఓవర్ కింద విధులు నిర్వహిస్తున్నారు. ఆయనపై ఫ్లైఓవర్ పెచ్చులు ఊడిపడడంతో చేతికి, భుజానికి గాయాలు అయ్యాయి. ఫ్లైఓవర్ ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడంతో ఫ్లైఓవర్ పటిష్టతపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -