సాధారణంగా ఏదైనా కొత్త పదాలు,సామేతలు విన్నా వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం అందరికి ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలైతే ఇలాంటి వాటి గురించి చెబితే ఆసక్తిగా వినే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సామెతలు ఒక చిన్న పదంగానే ఉన్నా వాటిలో ఎంతో పరమార్దం దాగుటుంది. అందులో భాగంగానే సింగినాదం – జీలకర్ర గురించినా ఆసక్తికర విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
సింగినాదం జీలకర్ర – ఒకప్పుడు జీలకర్ర వర్తకులు తమ రాకకు గుర్తుగా శ్రుంగనాదం (కొమ్ము బూర) ఊదేవారు.పాతకాలములొ జీలకర్ర వర్తకులు పడవలో వేసుకుని ఆ పడవలో కాలువలో వెళుతూ,ఏదైనా ఊరు వచ్చినప్పుడు బూర ఊదేవారట. అది విని కావలిసినవారు జీలకర్ర పడవ వచ్చిందని తెలుసుకొని కొనుక్కోవటానికి వెళ్ళేవాళ్ళు.
దీన్ని ఆసరాగా తీసుకుని దొంగలు కూడా బూర ఊది, వచ్చిన జనాల్ని దోచుకునేవారు.ఆ విధంగా శ్రుంగనాదం-జీలకర్ర వొకటయ్యాయి. కాలక్రమాన,శ్రుంగనాదం-జీలకర్ర కాస్తా సింగినాదం జీలకర్రగా వాడుకలో మారిపొయింది. ఇలా నిజమో అబద్ధమో తెలియని మాటలను సింగినాదం జీలకర్ర అని కొట్టి పారవేస్తుంటారు.