అమ్మాయిలకు పూరి అదిరిపోయే సలహా!

170
puri
- Advertisement -

అమ్మాయిలు తమకు కాబోయే భర్తల గురించి ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దని తెలిపారు దర్శకుడు పూరి జగన్నాథ్‌.పూరీ మ్యూజింగ్స్ పేరుతో అనేక అంశాలపై తన అభిప్రాయాలను చెబుతున్న పూరి….మహిళకు పర్‌ఫెక్ట్‌ తండ్రి, అమ్మ, డ్రైవర్‌, నర్సు దొరుకుతారేమో కానీ, పర్‌ఫెక్ట్‌ భర్త మాత్రం దొరకడని చెప్పారు. తను కోరుకున్నట్లే ఉండాలని అనుకుంటే సమస్యల్లో పడిపోతారని ఆయన చెప్పారు.

పెళ్లయిన ప్రతి అమ్మాయి ఏదో ఒక సమయంలో కన్నీరు పెట్టాల్సిందేనని తెలిపారు. జీవితంలో భార్యకు చెప్పి కొన్ని, చెప్పకుండా కొన్ని చేస్తాడని, దీంతో వారికి కోపం వస్తుందని తెలిపారు. అందులో తప్పులేదని అలాంటి తప్పులే అమ్మాయిల నాన్నలు చేస్తారు….తండ్రిని క్షమించినట్లే భర్తను కూడా క్షమించి వదిలేయాలన్నారు.

భర్త ఎంత గొప్ప వాడైతే భార్యకు అన్ని కన్నీళ్లు వస్తాయని…వివాహం అంటే సర్దుకుని పోవడమేనని చెప్పారు.

- Advertisement -