నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 823 ఓట్లకు గానూ కవితకు 728 ఓట్లు పోలవ్వగా బీజేపీ అభ్యర్ధి లక్ష్మీనారాయణకు 56,కాంగ్రెస్ అభ్యర్ధి సుభాష్ రెడ్డికి 29 ఓట్లు వచ్చాయి. 10 ఓట్లు చెల్లలేదు. దీంతో అంతా అనుకున్నట్లే టీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకే అయింది. కాంగ్రెస్, బీజేపీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. ఈ రెండు పార్టీల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి.
తొలి రౌండ్ ముగిసే సరికి కవిత గెలుపు ఖాయమైపోయింది. తొలి రౌండ్లో 600 ఓట్లకుగాను 542 కవితకు వచ్చాయి. జామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి అక్టోబర్ 9న పోలింగ్ జరిగింది. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, 823 మంది ప్రజాప్రతినిథులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
కవిత గెలుపుతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.