వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గల సోమిడి చెరువులో ఆదివారం రోజున చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ బండ ప్రకాష్, మేయర్ గుండా ప్రకాష్ రావు తదితరులతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఇప్పటివరకు ముదిరాజ్ లకు ఆత్మ గౌరవం కల్పించింది సీఎం కేసీఆరేనని అన్నారు. తెలంగాణ రాకముందు ముదిరాజ్ లను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు. సీఎం కేసిఆర్ అధికారంలోకి వచ్చాకనే ప్రతి కులానికి సముచిత గౌరవం కల్పించారన్నారు. 60 యేండ్లు అణచబడ్డ తెలంగాణ స్వరాష్ట్రం సాధించినంక రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుంది. ముదిరాజ్లు ఇతర దేశాలకు చేపలను ఎగుమతి చేసి పారిశ్రామికవేత్త లుగా ఎదగాలన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. సమైక్య పాలనలో తీవ్రంగా అణచబడ్డ ముదిరాజ్లు ఇప్పుడు స్వరాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతుకుతున్నారు అంటే కేవలం కేసీఅర్ వల్లేనని అన్నారు. మంత్రి ఎర్రబెల్లితో కలిసి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ముదిరాజ్ లు పాల్గొన్నారు.