ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను కవల పిల్లలకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె ఓ బాబు, పాపకు ఆమె జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఉదయభాను కొంత కాలంగా బుల్లితెరకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
కాగా ఉదయ భాను పది సంవత్సరాల క్రితం.. విజయవాడకు చెందిన బిజినెస్ మెన్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొన్న సంగతి విధితమే.. జీవితం జీరో నుంచి మొదలు పెట్టి లైఫ్ లో సెటిల్ అయ్యాక పిల్లలు అనుకోని.. ఇన్ని సంవత్సరాల తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకొన్నాము.. కావలలంటే చాలా ఇష్టం నాకు అందుకే దేవుడు కవల పిల్లలు ప్రసాదించాడు..అని ఇటీవలే ఉదయ భాను చెప్పింది.. కాగా ఇన్ని సంవత్సరాల తర్వాత మాతృత్వంలోని మధురిమను అనుభవిస్తున్న ఉదయ భానుకు సన్నిహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.