భారత్ బంద్‌లో భాగంగా రైతులు దేశవ్యాప్త ఆందోళన చేస్తున్నారు. రైతులకు ఆల్ ఇండియా కిసాన్ సభ మద్దతు తెలపడంతో దేశవ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా సాగుతోంది. బీహార్ రాజధాని పాట్నాలో రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ నిరసనలో పాల్గొన్నారు. అగ్రిబిల్లులను వ్యతిరేకిస్తూ తేజస్వి యాదవ్ ట్రాక్టర్‌ను నడిపారు.
న్బాగ్లో ఆర్జేడీ కార్యకర్తలు బర్రెలతో ర్యాలీ తీస్తూ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించారు.కర్నాటక-తమిళనాడు హైవే దారిలోని బొమ్మనహల్లి వద్ద రైతులు నిరసన చేపట్టారు.
ఢిల్లీ-అమృత్సర్ మధ్య ఉన్న హైవేను ఇవాళ రైతులు బ్లాక్ చేశారు. జలంధర్ వద్ద భారతీయ కిసాన్ యూనియన్, రెవల్యూషనరీ మార్కిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పంజాబ్‌లోని లుథియానా, అమృత్సర్ జిల్లాల్లో అదనపు బలగాలను మోహరించారు. రైతులు మూడు రోజుల రైల్ రోకో చేపట్టడంతో.. గురువారం నుంచి అనేక రైళ్లను రద్దు చేశారు.