తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక చట్టం టిఎస్ బిపాస్ అమలుపైన మంత్రి కేటీఆర్ వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో చర్చించారు. టీఎస్ బిపాస్ దేశంలో ఎక్కడా లేని విధంగా పౌరులకి అత్యంత సౌకర్యవంతంగా, సులభంగా, పారదర్శకంగా భవన నిర్మాణ అనుమతులను, లేఅవుట్లు అనుమతులు ఇస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే చట్టంగా రూపొందినదని, తర్వాత దాని అమలుకు సంబంధించిన కార్యక్రమాల పైన ఈ సందర్భంగా వివిధ శాఖల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ పలు సలహాలు సూచనలు ఇచ్చారు.
టిఎస్ బిపాస్ అనేది చారిత్రాత్మక చట్టమని దీని అమలులో వివిధ శాఖల సహకారం, సమన్వయం అవసరమని ఆ దిశగా ఇప్పటినుంచి ఆయా శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు. టిఎస్ బిపాస్ అనుమతులకు సంబంధించి అవసరం ఉన్న ప్రతి శాఖ నుంచి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ ని ప్రత్యేకంగా నియమించాలని ఈ సందర్భంగా మంత్రి వారికి సూచించారు. త్వరలోనే శాఖలన్నీ సమన్వయంతో సహకారంతో క్షేత్రస్థాయిలో టిఎస్ బిపాస్ అమలు చేసేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.