వ్యవసాయ బిల్లుల ఆమోదం, అనంతర పరిణామాలపై టీఆర్ఎస్ పార్టీ ఎంపీల నిరసన కొనసాగుతోంది.పార్లమెంట్ ఆవరణలో రాజ్యసభ విపక్ష సభ్యులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు టీఆర్ఎస్ ఎంపీలు. రైతాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు ఎంపీలు కె. కేశవ రావు, సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్.
రైతులను కాపాడటమే తమ ముందు ఉన్న కర్తవ్యమన్నారు టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు.మొదటిసారి ప్రతిపక్షాలు అన్ని కలిసి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం మార్చ్ నిర్వహించామని తెలిపారు. గాంధీ స్పూర్తితో ఈ ర్యాలీ నిర్వహించాం……గాంధీజీ కూడా భూమి కర్షకునిదే అన్నారు.
అలాంటి భూమిని ఇవ్వాళ కార్పొరేట్ సెక్టార్ కి ఇచ్చి రైతును అణగతొక్కుతున్నారని బీజేపీ సర్కార్‌పై మండిపడ్డారు.రైతుని కాపాడటం మా కర్తవ్యం……బిల్లులను తప్పుగా పాస్ చేశారు.. సభ్యులను తప్పుగా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.