టాలీవుడ్ లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ‘మల్టిపుల్ స్కెలెరోసిస్’ (ఎం.ఎస్) అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆ వ్యాధితో బాధపడుతున్నానని వివరిస్తూ ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇది కేవలం ఈ వయసు వాళ్లకే వస్తుందని లేదని.. ఎప్పుడు ఏ వయసు వాళ్లకైనా ఎప్పుడైనా రావచ్చని చెప్పాడు. ఈ వ్యాధి మెదడుకు శరీరానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని దెబ్బతీస్తుందని తెలిపాడు కీరవాణి. ఈ వ్యాధిపై ‘ఎంఎస్ ఇండియా’ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. ప్రభుత్వానికి తన గళాన్ని వినిపిస్తుందని వీడియోలో తెలిపాడు ఈ సంగీత దర్శకుడు.
ఈ వ్యాధితో బాధపడుతున్న వారంతా ధైర్యంగా ఉండేలా ఇతరులు వారికి సహకరించాలని ఆయన కోరారు. ఈ వ్యాధి ఉన్న వారు యోగా, సంగీతం వంటి వాటితో కాస్త ఉపశమనం పొందవచ్చని చెప్పారు. ఈ వ్యాధి గురించి సినీనటి విద్యా బాలన్ మాట్లాడిన వీడియోను కూడా ఆయన ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. ఇక కీరవాణి ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.