BJP ఎంపీ అరవింద్‌పై TRS ఎంపీల ఆగ్రహం..

212
trs
- Advertisement -

బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టిఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఈ రోజు టీఆర్‌ఎస్‌ ఎంపీలు రజింత్‌ రెడ్డి,ఎంపీ వెంకటేష్ నేత మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా ఎంపీ రజింత్‌ రెడ్డి మాట్లాడుతూ.. బిల్లులను వ్యతిరేకిస్తూ మేము మాట్లాడిన అంశాలపై సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇస్తేనే కేంద్రం దగ్గర డబ్బులు ఉంటున్నాయి.రాష్ట్రం నుంచి 50వేలు కోట్లు ఇస్తే కేంద్రం తిరిగి ఇచ్చేది కేవలం 23 వేల కోట్లే అని రంజిత్‌ రెడ్డి ఎద్దేవ చేశారు.

రాష్ట్రాలకు ఇవ్వాల్సిన చాలా ఆదాయాల్లో కోత విధించారు. నిజామాబాద్‌లో రైతులను అడుగు రైతు బంధు ఎవరు ఇస్తున్నారో చెప్తారు అని రంజిత్‌ రెడ్డి అన్నారు. కరోనా నియంత్రణకు కేవలం 290 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగులు నిధులు ఇచ్చే రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. జిఎస్టీ, వెనుకబడిన జిల్లాల నిధులు 9 వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. బిజెపి ఎంపీలు వాటిని ఇప్పించేందుకు కృషి చేయాలి అని ఎంపీ రంజిత్‌ రెడ్డి తెలిపారు.

ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల చేత శభాష్ అనిపించుకున్న ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు. బిజెపి ఎంపీలు సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడడం సిగ్గు చేటు. పార్లమెంట్ సభ్యుడిగా నీ యొక్క ఉన్నతిని పెంచుకోవాలి. ధర్మపురి అరవింద్.. నీ జీవితం జీరో, నువ్వో జీరో అని వెంకటేష్‌ ఎద్దేవ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కోవిడ్ కు ఎన్ని డబ్బులు ఇచ్చారని మీ నాయకుడి ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. కరోనా నియంత్రణకు కేంద్రం ఇచ్చింది కేవలం 290 కోట్లు మాత్రమే అన్నారు.

బిజేపి నాయకులు అబద్దాలు చెప్తూ తెలంగాణ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రధాని గారు ఇలా సభ్యత లేకుండా మాట్లాడమని మీ ఎంపీలకు చెప్పారా..? మాకు మాత్రం మా నాయకులు ఏనాడు అలా నేర్పించలేదని ఎంపీ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతలకు సభ్యత, సంస్కారం ఉంటుంది. ఈసారి మాట్లాడేటప్పుడు నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడు అని బిజేపి ఎంపీ అరవింద్‌పై ఆగ్రహించారు.బిజేపి నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించేది లేదు. ఎర్రగడ్డ అరవింద్ అని జోడిస్తే ఆయన మాట్లాడే విధానానికి సరిపోతుంది.

వ్యవసాయ బిల్లులు యుద్ధ వాతావరణంలో ఆమోదం చేశారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మేము ప్రజాస్వామ్య బద్దంగా రెవెన్యూ బిల్లు ఆమోదించినం.వీగిపోతుందని తెలిసే మూజువాణి ఓటుతో మీరు వ్యవసాయ బిల్లులు ఆమోదించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల చర్చ తరువాతే రెవెన్యూ బిల్లు ఆమోదం పొందింది. రైతులు సంబరాలు చేసుకున్నారు. మీరు తెచ్చిన బిల్లుపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. మీ మిత్రపక్ష కేంద్రమంత్రే రాజీనామా చేశారు. కేశవరావు మీ నాన్నకే రాజకీయాలు నేర్పాడు. స్థాయి తెలుసుకొని మాట్లాడు అరవింద్ అని టీఆర్‌ఎస్‌ ఎంపీ వెంకటేష్‌ నేత ఘాటుగా స్పందించారు.

- Advertisement -