- Advertisement -
సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు సికింద్రాబాద్ రైల్వే డివిజిన్‌లోని రాయగిరి రైల్వే స్టేషన్ పేరు మార్చుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి రైల్వేస్టేషన్‌ను యాదాద్రి రైల్వేస్టేషన్‌గా రైల్వేశాఖ మార్చింది.
ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేయగా నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ స్టేషన్‌కు వైఏడీడీ అన్న ఇంగ్లిష్ కోడ్, 09528583 అన్న న్యూమరికల్ కోడ్ కేటాయించారు.
యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం పూర్తయ్యాక హైదరాబాద్ జంట నగరాల నుంచి శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో దాదాపు లక్ష మంది వరకు దర్శనానికి వచ్చే అవకాశముంటుందని, భక్తుల సౌకర్యార్థం ఎంఎంటీఎస్ రైలును యాద్రాద్రి వరకు నడపాలని సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వాన్ని ఇప్పటికే కోరారు. ఘట్‌కేసర్ వరకు విస్తరించిన రైల్వే లైన్‌ను పొడిగించాలని విన్నవించారు.
- Advertisement -