ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం: శ్రీనివాస్ గౌడ్

141
Minister Srinivas Goud
- Advertisement -

ఈ రోజు చారిత్రాత్మక రోజు. పేద, బలహీన వర్గాలకు భూమిపై భద్రత ఇచ్చిన చట్టం ఇది అన్నారు మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్. సీఎం కేసిఆర్ రూపొందించి, అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన నూతన రెవెన్యూ చట్టం ఈ రోజు ఆమోదం పొందడం పట్ల మంత్రులు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…భూమికోసం కుటుంబ తగాదాలు, అన్నదమ్ములు చంపుకున్నవి, చివరకి తల్లి దండ్రులను చంపిన సందర్భంలో ఈ చట్టం వచ్చి ఇవేవీ లేకుండా చేసే శాశ్వత పరిష్కారం ఈ చట్టం అని మంత్రి అన్నారు.

తెలంగాణ వచ్చినపుడు ఎంత సంతోషం ఉన్నదో..ఈరోజు అంత సంతోషం ఉంది అని మన నాయకుడు చెప్పడం దీని యొక్క ప్రాముఖ్యతకు నిదర్శనం. ఈ చట్టం అమలైతే ఎక్కడ కేసిఆర్ కి పేరు వస్తుందోనని కొందరు రాజకీయం చేయడం దురదృష్టం. వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో తెలువదు. భూముల డిజిటల్ సర్వే చేయాలన్న ఆలోచన చాలా గొప్పదని మంత్రి తెలిపారు..ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. చట్టం మార్చినా వారిని తొలగించలేదు. చిన్న వి.అర్. ఏ లను కూడా వారికి భద్రత కల్పించడం వారి పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం.

93 శాతం ఉన్న సన్నకారు రైతులకు మేలు చేయాలని ఈ చట్టం తేవడం చాలా అదృష్టం.నేడు ఇతర రాష్ట్రాల్లో మేము కూడా తెలంగాణ రాష్ట్రం వలె చేస్తమనడం ఇక్కడ జరుగుతున్న విప్లవాత్మక మార్పులకు దేశవ్యాప్తంగా వస్తున్న కీర్తికి తార్కాణం. సీఎం కేసిఆర్ వైపు భారత దేశం మొత్తం చూస్తుంది. ఇలాంటి నాయకుడు దేశానికి ఉంటే తెలంగాణాలో వచ్చినటువంటి సాగునీటి ప్రాజెక్టులు వస్తాయని అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం తేవడమే కాకుండా..దానిని కాపాడుకుంటున్నారని మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

- Advertisement -