గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. ఖైదీ తొలి రోజు 47 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్టు నిర్మాత అల్లుఅరవింద్ ప్రకటించారు. ఇక శాతకర్ణి కలెక్షన్ల వివరాలు రావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల సంగతి కాసేపు పక్కనపెడితే.. అమెరికాలో రెండు సినిమాల విషయంలో భిన్న పరిస్థితి నెలకొంది. ఖైదీ నెంబర్ 150 సినిమా ఓవర్సీస్ హక్కులు 10.5 కోట్లకు, శాతకర్ణి హక్కులు 4.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. శాతకర్ణితో పోలిస్తే… ఖైదీ అత్యధిక ధరకు అమ్ముడుపోయినప్పటికీ, కలెక్షన్ల విషయంలో శాతకర్ణికి, ఖైదీ పోటీ రాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ప్రీమియర్ షోల ద్వారా ఖైదీ ఇప్పటికే 8.6 కోట్లు రాబట్టగా.. శాతకర్ణి 2 కోట్లు క్రాస్ చేశాడు.
అయితే శాతకర్ణి థియేటర్లకు సంబంధించి మరికొన్ని థియేటర్ల లెక్కలు రావాల్సి ఉంది. ఖైదీ విషయంలో సినిమా డిస్ట్రిబ్యూటర్లుకు నష్టాలు రాకూడదంటే.. కనీసం 13 నుంచి 14 కోట్ల మధ్య కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో శాతకర్ణి 6 నుంచి 7 కోట్లు కొల్లగొడితే చాలు. ఇప్పటివరకూ యూఎస్ లో బాలకృష్ణ సినిమాలేవీ 1 మిలియన్ డాలర్లు రాబ్టలేదు.
శాతకర్ణితో బాలయ్య ఆ ఘనత సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు బాహుబలి, శ్రీమంతుడు, అ..ఆ.., నాన్నకు ప్రేమతో.. సినిమాలు మాత్రమే 1 మిలియన్ డాలర్లు క్రాస్ చేశాయి. ఈ జాబితాలో శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 సినిమా.. చేరడం ఖాయమే. అయితే.. శాతకర్ణితో పోలిస్తే.. ఎక్కువ రేటుకు అమ్ముడుపోయిన ఖైదీ కనీసం 2 మిలియన్ల డాలర్లు రాబడితేనే లెక్క సరిపోతుంది. అయితే శాతకర్ణికి వన్ మిలియన్ మార్క్ కష్టమేమీ కాకపోయినా.. ఖైదీ 2 మిలియన్ మార్క్ క్రాస్ చేయడం అంతా ఈజీ కాదంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.