ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శాసనసభ, శాసనమండలి సమావేశాల నేపధ్యంలో సభల నిర్వాహణ, శాంతిభద్రతలు, కరోనా నివారణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో శాసనసభ ఆవరణలోని కమిటీ హాల్ లో సమావేశమైన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ నేతి విద్యాసాగర్ , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ బోడకంటి వెంకటేశ్వర్లు, శాసనసభ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు పాల్గొన్నారు.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ…ఈనెల 7వ తారీఖు నుండి ప్రారంభం అయ్యే ఈ దఫా సమావేశాలు ప్రత్యేకమైనవి.20 రోజులు వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నది.కరోనా మహమ్మారి నేపధ్యంలో ఈసారి సమావేశాలలో కొన్ని నిబంధనలను విధించడం జరుగుతుంది.శాసనసభ్యుల, మరియు సిబ్బంది క్షేమం కోసమే ఈ నిబంధనలు.పురపాలక, వైద్య ఆరోగ్యశాఖ, GHMC ల ద్వారా అసెంబ్లీ సమావేశ మందిరంలో మరియు పరిసరాలలో శానిటైజేషన్ కార్యక్రమాలు రోజుకు రెండు సార్లు చేపడతాం.ప్రతి సభ్యుడు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలి.సభ్యుల ఆరోగ్య రక్షణ కోసం ధర్మల్ స్క్రీనింగ్, ర్యాపిడ్ టెస్ట్ లు చేస్తాం.మెంబెర్స్ కోసం అసెంబ్లీ, మండలి ఆవరణలో రెండు ప్రత్యేక డయాగ్నోసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం.రెండు అంబులెన్స్ లు అందుబాటులో ఉంటాయి.అనుభవగ్నులైన డాక్టర్లు డ్యూటీలో ఉంటారు.ప్రతి సభ్యుడికి ఆక్సీమీటర్, మాస్క్, శానిటైజర్, ఇతర అత్యవసరమైన మెడికల్స్ తో కూడిన కిట్ ను అందజేస్తాం.మంత్రులతో పాటు ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే అనుమతి ఇస్తాం..శాసనసభ్యుల వ్యక్తిగత సిబ్బందికి అనుమతి లేదన్నారు.
సిబ్బంది కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలి.ఈరోజు సాయంత్రం నుండే పరీక్షలు చేయడం ప్రారంభిస్తున్నాం.శాసనసభ్యులు, మండలి సభ్యులు, అసెంబ్లీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, మంత్రుల సిబ్బంది, అసెంబ్లీ మార్షల్స్ 6వ తేది నాటికి కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు.హైదరాబాద్ లో ఉండే సభ్యులు అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రంలో టెస్ట్ చేయించుకోవాలి.జిల్లాలో ఉన్న సభ్యులు సమాచారం అందిస్తే అక్కడే టెస్ట్ లు నిర్వహిస్తాం….పాజిటివ్ రిపోర్టు వస్తే సభ్యులు, సిబ్బంది ఎవ్వరు కూడా అసెంబ్లీ ఆవరణలోకి, సభకు రావద్దు.మాస్క్ లు ఉంటేనే సభలోకి అనుమతిస్తాం.నెగెటివ్ రిపోర్ట్ ఉన్న సిబ్బందిని మాత్రమే అసెంబ్లీ ఆవరణలోకి అనుమతిస్తాం.కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అసెంబ్లీ ఆవరణలో కొన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవలసిన పరిస్థితులు తలెత్తాయి.వివిధ రాష్ట్రాలలో, పార్లమెంటు లో అనుసరిస్తున్న నిబంధనలకు అనుగుణంగానే వచ్చే శాసనసభ సమావేశాల సందర్భంగా మీడియాకు కొన్ని నిబంధనలను విధిస్తున్నాం.అందరి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ లాబీల్లో ఈసారి మీడియా ప్రతినిధులను అనుమతించకూడదని నిర్ణయించాం.అదేవిధంగా నిరంతరం రద్దీగా ఉండే మీడియా పాయంట్ కూడా కరోనా పరిస్థితుల దృష్ట్యా తొలగించడమైనది.మీడియా ప్రతినిధులు, యాజమాన్యాలు సహకరించాలని మనవి.ఈసారి విజిటర్స్ కు అనుమతి లేదు.నో లాభి పాసెస్, విజిటర్స్ గ్యాలరీలో కూడా మీడియా ప్రతినిధులకు సీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం.చర్చల సమయంలో సభ్యులు పూర్తి సహాయ,సహకారాలను అందించాలని విజ్ఞప్తి.సభ్యులు తమకు కేటాయించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.