సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జనసేన….

231
- Advertisement -

తెలుగు ప్రజలకు ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సుభిక్షింగా ఉండాలని శుక్రవారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. సంక్రాంతి పండగ కాంతిని నింపి ఏపీకి ప్రత్యేక హోదా పండగ తీసుకురావాలని కోరుకున్నారు. నోట్ల రద్దు వంటి గాయాలు మళ్లీ చేయకుండా రాజకీయ పెద్దల నుంచి కాపాడాలని వపన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.అంతేగాక, ఈ సంక్రాంతి పండగ ఉద్దానం కిడ్నీ బాధితులకు స్వాంతన కలగజేయాలని పేర్కొన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఇచ్ఛాపురంలో ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్న విషయం తెలిసిందే.

Katamarayudu Sankranthi WISHES

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా కాటమరాయుడు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ దర్శకుడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి నెలాఖరున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే షూటింగ్ మొదలై చాలా కాలం అవుతున్నా ఇంత వరకు సినిమాకు సంబంధించిన టీజర్ మాత్రం రిలీజ్ కాలేదు.

Katamarayudu Sankranthi WISHES

న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా ఫస్ట్ టీజర్ రిలీజ్ అవుతుందన్న ప్రచారం జరిగినా.. కేవలం మోషన్ పోస్టర్ తోనే సరిపెట్టేశారు చిత్రయూనిట్. ఆ తరువాత సంక్రాంతి కానుకగా తొలి టీజర్ రిలీజ్ అవుతుందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు మరోసారి టీజర్ లాంచ్ వాయిదా వేశారు. సాంకేతిక కారణాల వల్ల కాటమరాయుడు టీజర్ రిలీజ్ చేయలేకపోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో వినూత్న రీతిలో చేసిన ‘కాటమరాయుడు’ ప్రచారం అభిమానుల్లో హుషారు పుట్టించింది. ఈ సందర్బంగా తెలుగు ప్రేక్షకులకి చిత్ర బృందం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. సంక్రాంతి కానుకగా మరికొన్ని ప్రచార చిత్రాలని విడుదల చేస్తున్నారు. కాటమరాయుడు సినిమా టీజర్ ని జనవరి 26న విడుదల చేస్తున్నట్టు నిర్మాత శరత్ మరార్ తెలిపారు.

- Advertisement -