తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి…

176
pspk
- Advertisement -

అసాంఘిక శ‌క్తులు సృష్టించే త‌ప్పుడు వార్త‌ల‌ను, వ‌దంతుల‌ను, త‌ప్పుడు సోష‌ల్ మీడియా పోస్టుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, షేర్ చేయొద్ద‌ని హైదరాబాద్ సిటీ పోలీసులు విజ్ఞ‌ప్తి చేశారు. వ‌దంతులు, త‌ప్పుడు సోష‌ల్ మీడియా పోస్టుల గురించి 9490616555 నంబ‌ర్‌కు ఫిర్యాదు చేయాల‌ని పోలీసులు సూచించారు. ప్ర‌తి పౌరుడు స‌మాజ భ‌ద్ర‌త‌కై కృషి చేయాల‌ని హైద‌రాబాద్ పోలీసులు కోరుతున్నారు.

సోషల్ మీడియాలో వ‌చ్చే కొన్ని వార్త‌లు, విష‌యాలు న‌మ్మ‌శ‌క్యంగా ఉండ‌డం లేదు. త‌ప్పుడు వార్త‌లు, విష‌యాలు అధికంగా వైర‌ల్ అవుతున్న నేప‌థ్యంలో ఏది నిజ‌మో, ఏది అబ‌ద్ధ‌మో తెలుసుకోలేని ప‌రిస్థితి దాపురించింది. ఫేక్ న్యూస్ వైర‌ల్ కావ‌డంతో ఓ వైపు ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గుర‌వ‌డం, మ‌రోవైపు ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫార్వార్డెడ్ మేసేజ్‌ల‌ను మ‌ళ్లీ ఫ్వార్వార్డ్ చేయొద్ద‌ని పోలీసులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

- Advertisement -