యువతే దేశ సంపద..కేటీఆర్‌

148
Minister
- Advertisement -

వివేకనంద స్ఫూర్తి తో యువత దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. సమస్యలను పట్టుదలగా తీసుకుని వాటిపై విజయం సాధించటమే స్వామి వివేకానందకు నిజమైన నివాళి అని మంత్రి పేర్కోన్నారు. వివేకనందుని 155వ జయంతి సందర్భంగా రామకృష్ణా మఠంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ప్రపంచంలో మరే దేశానికి లేని మానవ వనరుల సంపద భారతదేశానికి ఉందన్నారు. భారతదేశంలో సగం జనాభా యూతేనని..వారే ఈ దేశానికి సంపద అని కేసీఆర్ కొనియాడారు.

Minister
ప్రపంచమంతా వృద్ధాప్యంలోకి వెళ్తొంటే.. భారత్‌ మాత్రం యువ్వనంతో ఉరకలెత్తుతోందని మంత్రి అన్నారు. స్వామీ వివేకానంద భోదనలు నిత్యం స్ఫూర్తినిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. మన దైనందిన జీవితంలో చుట్టూ ఉండే సమస్యల నుంచి వచ్చే నిస్పృహా లెక్కకట్టడం సులువు. కానీ.. దాన్ని పాజిటవ్‌గా మలుచుకోవడమే స్వామీ వివేకానంద మనకు ఉద్భోదించారని మంత్రి అన్నారు. ప్రస్తుతం సమాజంలో చుట్టూ జరుగుతున్న పరిణామాలు చికాకు, నిరాశ, నిస్పృహలు కలిగిస్తున్నాయని.. అయినా వివేకానంద స్ఫూర్తితో వాటిపై విజయం సాధించాలని పిలుపునిచ్చారు. వివేకానంద స్ఫూర్తితో యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ ముఖ్యమంత్రి పంపిన సందేశాన్ని కేటీఆర్‌ చదివి వినిపించారు.

- Advertisement -