మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి కన్నుమూత…సీఎం కేసీఆర్ సంతాపం

639
edma krishna reddy
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత ఎడ్మ కిష్టారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చెందారు.కల్వకుర్తి నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుగపొందారు కృష్ణారెడ్డి.

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగాఢ సంతాపం తెలిపారు. సామాజిక సేవా దృక్పథం, సామాజిక సృహ కలిగిన నాయకుడిగా కృష్ణారెడ్డి ప్రజల అభిమానం సంపాదించారని సీఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నిరాడంబర జీవితం గడిపి ఆదర్శంగా నిలిచిన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి గారి మరణంపట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తీవ్ర సంతాపం ప్రకటించారు.

రైతు పక్షపాతి, ప్రజల పక్షపాతి అయిన కిష్టారెడ్డి గారు సర్పంచ్ నుండి ఎమ్మెల్యే వరకు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని మనిషిగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. వారి మరణం కల్వకుర్తి ప్రజలకు తీరని లోటని, సమైక్య రాష్ట్రంలో రైతాంగం పక్షాన వారి పోరాటాలు ప్రజల మనసుల నుండి చెరిగిపోవని అన్నారు. వారి అనుభవం ఈ ప్రాంత అభివృద్దికి ఉపయోగపడే సమయంలో వారు మరణించడం బాధాకరమని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తపరిచారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ..కిష్టారెడ్డి కుమారుడు, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంకు ఫోన్ చేసి పరామర్శించారు.

- Advertisement -