- Advertisement -
ఎంహెచ్ఆర్డీ ఇకపై కేంద్ర విద్యాశాఖగా మారింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎంహెచ్ఆర్డీ) పేరును విద్యాశాఖగా మార్చే ఫైలుకు అమోదముద్ర వేశారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్.
ఇప్పటికే కేంద్ర కేబినెట్ అమోద ముద్రవేయగా సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి ఆమోద ముద్రవేశారు రాష్ట్రపతి. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1985లో విద్యామంత్రిత్వశాఖ పేరు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖగా మార్చారు.తొలి హెచ్ఆర్డీ మినిస్టర్‌గా పీవీ నరసింహరావు పనిచేయగా నూతన విద్యావిధానంలో భాగంగా హెచ్ఆర్డీ పేరును విద్యాశాఖగా మార్చింది కేంద్రం.
- Advertisement -