ఉద్యోగంలో చేరిన కల్నల్ సంతోష్ బాబు భార్య…

151
santhoshi
- Advertisement -

స్వాతంత్ర్య దినోత్సవం రోజే ప్రభుత్వానికి రిపోర్టు చేశారు కల్నల్ సంతోష్‌ భార్య సంతోషి. హైదరాబాద్ బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ని కలిసి జాయినింట్ రిపోర్టు అందించారు. అనంతరం సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ని కలుసుకున్నారు సంతోషి. ఈ సందర్భంగా సంతోషి స్పూర్తికి అభినందనలు తెలిపారు స్మితా సబర్వాల్.

దేశ సరిహద్దుల్లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఆ వీరుడి కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం రూ.5 కోట్ల నగదుతో పాటు హైదరాబాద్‌లో స్ధలం,ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. చెప్పినట్లుగానే సీఎం కేసీఆర్ స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి ఆ పత్రాలను వారి కుటుంబసభ్యులకు అందజేశారు.

- Advertisement -