- Advertisement -
వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తగ్గినా దేశీయ మార్కెట్లలో మాత్రం బంగారం ధర పెరుగుతూ వస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.260 పెరిగి రూ.55,760కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 పెరుగుదలతో రూ.51,110కు చేరింది.
బంగారం ధర పెరిగితే వెండి మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ.50 తగ్గి రూ.66,950కు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.85 శాతం క్షీణించి ఔన్స్‌కు 1953 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 4.27 శాతం తగ్గుదలతో 26.53 డాలర్లకు దిగొచ్చింది.
- Advertisement -