దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్150ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంత సుదీర్ఘకాలం తర్వాత వెండితెరపై కనిపించిన చిరు ఏమాత్రం చెక్కు చెదరకుండా అదే స్టైల్‌లో నటించాడు. డ్యాన్సు,యాక్షన్స్‌లతో అదరగొట్టాడు. సినిమా హిట్ టాక్‌తో చిరు అభిమానుల ఆనందానికి ఆవధులు లేకుండా పోయింది. ఈ విజయంతో బాస్ రీఎంట్రీ అదిరిపోయిందటు థియేటర్ల ముందు మెగా అభిమానులు సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు.
సినిమా రిలీజ్కు ముందే నాగార్జున, మోహన్ బాబు, రాధిక లాంటి సీనియర్ నటులు మెగాస్టార్ రీ ఎంట్రీ సందర్భంగా శుబాకాంక్షలు తెలియజేయగా రిలీజ్ తరువాత దర్శకులు తమదైన స్లైల్లో స్పందిస్తున్నారు. ఇక చిరంజీవి పై పలువురు దర్శకులు,హీరోలు ట్వీట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.
దర్శకుడు రాఘవేంద్ర రావు ట్వీట్….’సినిమా చేసి చాలా రోజులు అయింది’ అనే మాట కేవలం మాట వరసకు మాత్రమే. అదే జోరు..అదే ఊపు.. అదే గ్రేసు… జై చిరంజీవా. జగదేకవీరా. అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు స్పెషల్ ట్వీట్ చేశారు.
తనకు నచ్చే సినిమాలపై ట్వీట్ రివ్యూలనందించే రాజమౌళి మెగా బాస్ రీఎంట్రీని ఆకాశానికి ఎత్తేశాడు. బాస్ ఈజ్ బ్యాక్, చిరంజీవి గారు తిరిగి ఇండస్ట్రీకి వచ్చినందకు థ్యాంక్స్. పదేళ్ల పాటు మిమ్మల్ని మిస్ అయ్యాం. తొలి చిత్రంతోనే నిర్మాతగా రికార్డ్లు సృష్టిస్తున్నందుకు చరణ్కు శుభాకాంక్షలు. వినయ్ గారు కుమ్మేశారంతే. ఈ ప్రాజెక్ట్ను మీకన్నా బాగా ఇంకేవరూ తీయలేరు.’ అంటూ ట్వీట్ చేశాడు రాజమౌళి.
మరో మెగా అభిమాని, దర్శకుడు మారుతి కూడా ఖైదీపై ట్వీట్ చేశాడు….ఖైదీ నంబర్ 150తో బాస్ మాత్రమేకాదు తెలుగు సినిమాకు మంచి రోజులు కూడా వెనక్కి వచ్చాయి’ అంటూ ట్వీట్ చేశాడు మారుతి.
‘బాక్సాఫీసులు బద్దలు.. అన్ని ఏరియాలనూ రఫ్ అడిస్తున్న మెగాస్టార్..’ అని ట్వీట్ చేశారు దర్శకుడు హరీశ్ శంకర్. ఇక హీరో అల్లుఅర్జున్..‘అమ్మడు! లెట్స్ డు రికార్డ్స్ కుమ్ముడు!’ అని ట్వీట్ చేశారు. అల్లు శిరీష్ ‘మెగా సర్జికల్ స్ట్రైక్’ అని ట్వీట్ చేశారు. ఇలా ఒక్కొక్కళ్ళూ చేస్తున్న ట్వీట్లతో నెమ్మదిగా ట్విట్తర్ నిండిపోతోంది.