- Advertisement -
బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఆస్పత్రి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయిన తర్వాత షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సంజయ్‌కి స్టేజ్ 3 ఉపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించడంతో బాలీవుడ్ షాక్‌కు గురైంది.
ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తుండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం స్పందించారు. సంజయ్ దత్‌ని హగ్ చేసుకున్న ఫోటోని షేర్ చేస్తూ.. భాయ్ , మీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని చాలా బాధపడ్డాను. మీరు గొప్ప పోరాటయోధుడు. కొన్ని సంవత్సరాలుగా అనేక సంక్షోభాలని అధిగమించారు. ఈ సమస్య నుండి కూడా బయటకి రావాలని ఆకాంక్షించారు.
ఇక లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న సంజయ్…చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం.
- Advertisement -