- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని తెలిపారు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్లగొండలోని తన నివాసంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన గుత్తా..అభివృద్ధిలో తెలంగాణ అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు.
రానున్న రోజుల్లో ప్రపంచం గుర్తించే విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందబోతుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరు పేదలకు వరమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో ఆదర్శంగా ఉందన్నారు.
అద్భుతమైన సంక్షేమ పథకాలని అమలు చేస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు మేలు కలుగుతుందన్నారు.
- Advertisement -