- Advertisement -
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టిన తొలిదేశంగా రష్యా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. తొలి వ్యాక్సిన్‌ను తన కూతురుకి ఇచ్చినట్లు ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు పుతిన్….తొలుత వైద్య సేవలు అందించేవారికి,ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జనవరి నుండి సామాన్యులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో రష్యా వ్యాక్సిన్ అడ్వాన్స్ బుకింగ్స్ కోసం చాలాదేశాలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే 20 దేశాలు వ్యాక్సిన్ డోసుల కోసం ప్రీ ఆర్డర్ చేశాయని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అధిపతి కిరిల్ డిమిత్రియేవ్ తెలిపారు. స్పుత్నిక్ వీకి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామన్నారు.
తమ వ్యాక్సిన్ పై వచ్చే తప్పుడు వార్తలను ఖండిస్తూ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామని రష్యా ప్రకటించింది.
- Advertisement -