వ్యాక్సిన్ కనుగోన్న రష్యా….పుతిన్ అధికారిక ప్రకటన

553
puthin
- Advertisement -

కరోనా పై పోరులో తొలి వ్యాక్సిన్ కనుగోన్న దేశంగా రష్యా నిలిచింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్. ప్రపంచంలో మొట్టమొదటి కరోనావైరస్ వ్యాక్సిన్‌ను రష్యా అభివృద్ధి చేసిందని దీనికి రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా లభించిందని పేర్కొన్నారు పుతిన్. తన కూతురికి మొదట వాక్సిన్ వేయించానని తొలుత జ్వరం వచ్చి తర్వాత తగ్గిందని తెలిపారు పుతిన్. త్వరలోనే భారీస్ధాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు.

ఈ వ్యాక్సిన్ ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి కరోనా నియంత్రణలోకి వస్తుందని చెప్పారు. సెప్టెంబ‌ర్ నుంచి ఈ టీకాను తొలుత హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు,ఉపాధ్యాయులకు ఇవ్వ‌నున్న‌ట్లు …. జ‌న‌వ‌రి నుంచి సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు టీకా అందుబాటులో ఉంటుంద‌న్నారు.

మాస్కోకు చెందిన గమలేయ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌కు మానవ పరీక్షలు చేసిన రెండు నెలల కన్నా తక్కువ సమయంలోనే అనుమతి లభించడం విశేషం. టీకా వేసుకున్న తరువాత 21వ రోజుకు వైరస్‌ను అడ్డుకునేలా రోగనిరోధక వ్యవస్థ బలోపేతమైందని, రెండో డోస్‌తో ఇది రెట్టింపు సామర్థ్యం సంతరించుకుందని ఆదేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -