డిసెంబర్‌లో కరోనా వ్యాక్సిన్‌ : ట్రంప్

191
donald trump
- Advertisement -

ఈ ఏడాది చివరికల్లా కరోనా వైరస్‌ వస్తుందని స్పష్టం చేశారు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్. అమెరికాలో ఇప్పటివరకు 65 మిలియన్ల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించామని…తమకు దగ్గరలో ఏదేశం కూడా లేదన్నారు.

డిసెంబర్‌లో కరోనా వ్యాక్సిన్ వస్తుందని బలంగా నమ్ముతున్నామని…వైర‌స్ ప‌రీక్ష‌లు చేప‌ట్టిన దేశాల్లో భార‌త్ రెండ‌వ స్థానంలో ఉన్న‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు.

చైనా వైఖ‌రి ప‌ట్ల అస‌హ‌నంతో ఉన్నామని…. ఒక‌వేళ మేం ఎన్నిక‌ల్లో నెగ్గితే ఇరాన్ త‌మ‌తో ఒప్పందం కుదుర్చుకుంటుంద‌ని ట్రంప్ తెలిపారు. చైనాతో డీల్ చేసుకోవాలా వ‌ద్దా అన్న అంశంలో సందేహం నెల‌కొన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

- Advertisement -