ఇంగువతో ఎన్నో లాభాలు…..

566
hing
- Advertisement -

ఒక అరకప్పు నీటిలో చిన్న చిన్న కొన్ని ఇంగువ ముక్కలను కరగించి తీసుకొంటే అజీర్ణ, ఋతుసమస్య నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

స్త్రీలకు సంబంధించిన రుతు సంబంధ సమస్యల నొప్పి, సక్రమంగా లేని, బాధతోకూడిన రుతుక్రమాలు వంటి వాటికి ఇంగువ ఒక శక్తివంతమైన ఔషదంల పని చేస్తుంది.

Benefits of Asafetida

పొడి దగ్గు, కోరింత దగ్గు, శ్వాస నాళముల వాపు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధ వ్యాధులు తగ్గడం కోసం తేనే, అల్లంతో కూడిన ఇంగువ వాడితే ఉపశమనం లభిస్తుంది.

గ్లాస్ నీటిలో ఇంగువను కరిగించి తీసుకొంటే మైగ్రియిన్లు, తలనొప్పులను తగ్గిస్తుంది.

గ్లాస్ నిమ్మరసం లో చిన్న ఇగువ కలిపి తీసుకుంటే పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

మలబద్ధకం ఉన్నవారు రాత్రి పడుకో బోయేముందు ఇంగువ చూర్ణం తీసుకుంటే ఫలితం ఉంటుంది.

Benefits of Asafetida

భోజనానం తరువాత ఒక చిటికెడు ఇంగువ, చిటికెడు ఉప్పును మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపుబ్బరం తగ్గుతుంది. దీనివల్ల ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.

పళ్ళు పుచ్చిపోయి ఉంటే రాత్రి పడుకునేముందు కాస్త ఇంగువ ఆ పంటిపై ఉంచితే క్రిములను మటుమాయం చేస్తుంది.

ఇంగువ చాలా ఒగరుగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

మనం తినే ఆహారం లో ప్రతి రోజు ఇంగువ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే మనం ఆరోగ్యవంతంగా ఉండవచ్చు.

- Advertisement -