- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన వన యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కోట్ల గుండెలను తాకుతుంది. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” పేరు వినిపిస్తే చాలు ప్రకృతిని ప్రేమించే సెలబ్రెటీలంతా పరవశించిపోతున్నారు.
ఛాలెంజ్ రావడమే ఆలస్యం తమ బాధ్యతల్ని నెరవేరుస్తున్నారు.“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా రాహుల్ సిప్లిగంజ్ , ఆర్.జె కాజల్ , అదిరే అభీ ఇచ్చిన పిలుపును స్వీకరించిన యాక్టర్ అలీ రేజ మారేడుపల్లి లోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం, తన స్నేహితుడు సినీ నటుడు నవదీప్ , యాక్టర్ నోయల్ సీన్ మరియు తన అభిమానులందరికి ఛాలెంజ్ విసిరి, ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ గారిని మనసారా అభినందిస్తున్నట్టు అలీ రేజా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
- Advertisement -