- Advertisement -
బంగారం భగభగమంటోంది. వినియోగదారులకు షాకిస్తూ ఆల్ టైం హైకి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. పసిడి బాటలోనే వెండికూడా ఆల్ టైం హైకి చేరగా బంగారం ధర పెరగడం ఇది వరుసగా ఆరో రోజు కావడం గమనార్హం.
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.820 పెరిగి రూ.54,300కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.730 పెరుగుదలతో రూ.49,780కు చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.840 పెరిగి రూ.50,800కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.840 పెరుగుదలతో రూ.52,000కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.3490 పెరుగుదలతో రూ.64,700కు చేరింది.
- Advertisement -