మిహీకా పర్‌ఫెక్ట్ జోడి..పెళ్లికి ఇదే కరెక్ట్ టైం: రానా

206
rana
- Advertisement -

టాలీవుడ్ హీరో, బాహుబలి ఫేం రానా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టులో రానా తన స్నేహితురాలు మిహీకాను పెళ్లిచేసుకోబోతుండగా తన వివాహానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన పెళ్లికి ఇదే కరెక్ట్ టైం…మిహీకా తనకు పర్‌ఫెక్ట్ జోడి అని తెలిపారు రానా. జీవితంలో అన్ని వాటంతట అవే సజావుగా సాగి పోతూ ఉంటాయి. ఇప్పుడు పెళ్లి అనేది కూడా అంతే సజావుగా సాగుతుందని నేను భావిస్తున్నానని వెల్లడించారు రానా. మా జోడి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని నమ్ముతున్నానని తెలిపారు.

ఆగస్టు 8న రానా – మిహీకాల వివాహం జరగనుంది. ఇందుకు హైదరాబాద్ ఫలక్‌నుమా ప్యాలెస్ సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో అతికొద్దిమంది అతిథుల సమక్షంలోనే పెళ్లి జరగనుంది.

- Advertisement -