ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం గ్రేటర్ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా ధృక్పథాన్ని చాటారు. జన్మదిన వేడుకలను ఆట్టహాసంగా కాకుండా నిరాడంబరంగా సేవా ధృక్పథంతో జరపాలన్న కేటీఆర్ పిలుపునకు టీఆర్ఎస్ శ్రేణులు ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. రోగులకు, అనాథలకు పండ్లు, బట్టలు పంపిణీ చేశారు . పలు చోట్ల మొక్కలు నాటి హరిత స్పూర్తిని చాటారు. ప్రధానంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, నాయకులు పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన రక్తదానం రికార్డుల్లోకి ఎక్కింది. శుక్రవారం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరంలో 2216 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేశారు. కరోనా సమయంలో దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఒకేరోజున ఇంతమంది రక్తదానం చేయడాన్ని ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో నమోదు చేయనున్నారు.
సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కలాసిగూడలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా విద్యాధికారి వెంకట నర్సమ్మతో కలిసి మంత్రి తలసాని విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. నాంపల్లిలోని నిలోఫర్ హాస్పిటల్లో టీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి ఆనంద్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌తో కలిసి రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
గన్‌ఫౌండ్రిలో కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలోని కోఠిలోని మెటర్నిటీ దవాఖానాలో రోగులకు, సిబ్బందికి పండ్లు, చీరలను పంపిణీ చేశారు. టీఎన్జీవో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షతన ఎస్ఎం హుస్సేన్ని ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిపారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్ పాల్గొన్నారు. గృహకల్ప కార్యాలయంలో కేక్ కటింగ్ ఆనంతరం పిచ్చుకలను పంజరం నుండి వదిలి వేశారు. ఆనంతరం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మంత్రి అల్లోలతో పాటు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేక్ కట్ చేసి.. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆస్పత్రుల్లో రోగులకు పాలు, బ్రెడ్లు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అన్ని చోట్ల మొక్కలు నాటగా.. పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. నియోజకవర్గాల వారీగా కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిలాబాద్ నియోజకవర్గం..
ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ ఆధ్వర్యంలో మావల హరితవనంలో మొక్కలు నాటారు. జోగు రామన్న ఇంటి వద్ద కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం నిర్వహించగా.. కనాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ ఆధ్వర్యంలో రిమ్స్‌లో రోగులకు అన్నదానం చేయగా.. 23వ వార్డులో మొక్కలు నాటారు. మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ రంగినేని మనీషా అనాధాశ్రమంలో చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు.
బోథ్ నియోజకవర్గం
బోథ్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
నిర్మల్ పట్టణంలోని ఎంసీహెచ్ మెటర్నిటీ హాస్పటల్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బాలింతలకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్త దాన శిబిరాన్ని ప్రారంభించి.. మొక్కలు నాటారు.
ముధోల్ నియోజకవర్గం
ముధోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే విఠ్ఠల్రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి.. మొక్కలు నాటారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానాలో చికిత్స పొందుతున్న వారికి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. తానూర్ మండలం బామ్ని, భైంసా మండలం వానల్పాడ్, కుంటాలలో స్థానిక ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు.
ఖానాపూర్ నియోజకవర్గం
ఉట్నూర్‌లో తన నివాసంలో ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్ధన్ ఆధ్వర్యంలో మొక్క నాటారు. ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మన్ అంకం రాజేందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి.. మొక్కలు నాటారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు.
సిర్పూర్(టి) నియోజకవర్గం
కాగజ్‌నగర్‌లోని వినయ్ గార్డెన్లో స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో అభిమానుల మధ్య కేక్ కట్ చేసి.. రక్తదాన శిబిరం నిర్వహించారు. 176మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు.
ఆసిఫాబాద్ నియోజకవర్గం
ఆసిఫాబాద్‌లోని జడ్పీ ఛైర్ పర్సన్ కోవ నివాసంలో కోవ లక్ష్మీతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి.. మొక్కలు నాటారు. సిర్పూర్(యు)లో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కనక యాదవరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.
బెల్లంపల్లి నియోజకవర్గం
బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మొక్కలు నాటారు. కాసిపేట మండలం దేవాపూర్ డంపింగ్ యార్డు వద్ద రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పూస్కూరి రామ్మోహన్రావు మొక్కలు నాటారు.
బెల్లంపల్లి మండలంలో జెడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
మంచిర్యాల నియోజకవర్గం
మంచిర్యాల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ఆయన తనయుడు విజిత్‌రావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా ఆస్పత్రిలో 30మంది పారిశుధ్య కార్మికులు ఎమ్మెల్యే దివాకర్‌రావు చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. మంచిర్యాల మున్సిపల్ ఛైర్మన్ పెంట రాజయ్య 15మంది పేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
చెన్నూర్ నియోజకవర్గం
కోటపల్లి మండలంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్.. ఒక నిరుపేద మహిళకు నెల రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు, రూ.5వేల నగదు పంపిణీ చేశారు. చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్సీ సతీష్‌కుమార్ పాల్గొని.. స్వయంగా రక్తదానం చేశారు. మందమర్రి ఏరియా కేకే-5 గని ఆవరణలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. రామకృష్ణాపూర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ సమన్వయ కర్త అబ్దుల్ హజీజ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి.. జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు వేడుకలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘనంగా జరిగాయి. ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆసుపత్రుల్లో పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. మొక్కలు నాటి, కేక్ కట్ చేశారు. నియోజకవర్గాల వారిగా జరిగిన కార్యక్రమాలు ఇలా…
సంగారెడ్డి జిల్లా :
నారాయణేడ్ : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కేటీఆర్ బర్త్‌డే వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్… పాల్గొన్నారు.
అందోలు జోగిపేట : వట్పల్లి మండలం పోతులబోగుడ గ్రామంలో రాహుల్ కిరణ్(ఎమ్మెల్యే క్రాంతి సోదరుడు) మొక్కలు నాటి, విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేశారు.
సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణంలో టీఆర్ఎస్వీ అధ్యక్షుడు శ్రావణ్, కౌన్సిలర్ పవర్నాయక్, రాజేందర్లు కేటీఆర్ జన్మదినోత్సం సందర్భంగా మొక్కలు నాటారు.
పటాన్చెరు : పటాన్చెరులో కేటీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు. రామచంద్రాపురంలో కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కార్పోరేటర్ సింధూ ఆదర్శరెడ్డి పేదలకు బియ్యం, సరుకులు పంపిణీ చేశారు.
మెదక్ పట్టణంలో ఎమ్మెల్యే పద్మాదేవెందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శేరి సుభాష్‌రెడ్డి మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లి కార్జున్గౌడ్లు పాల్గొన్నారు. సిద్దిపేటలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డిలు కేక్ కట్‌చేసి కేటీఆర్ పుట్టిన రోజు వేడకులు జరుపుకున్నారు.
గజ్వేల్ : గజ్వేల్ పట్టణంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గ్రందాలయ సంస్ధ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ, రైతు బంధు సమితి రాష్ట్ర సభ్యులు దేవిరవిందర్, డాక్టర్ యాదవరెడ్డిలు కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బర్త్ డే సందర్భంగా ఉభయ జిల్లాల్లోనూ పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించాయి. గ్రామాల్లో, పట్టణాల్లో జోరుగా కార్యక్రమాలు జరిగాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో జరిగిన ముఖ్యమైన ఈవెంట్స్‌కు సంబంధించిన వివరాలు పంపుతున్నాను.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ అండ్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి పార్టీ కార్యాలయంలో మొక్క నాటారు. స్నేహా సొసైటీలో వృద్ధులకు పలువురు టీఆర్ఎస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు.
కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొడంగల్, బొంరాస్‌పేట లో కేక్ కట్ చేశారు. బొంరాస్‌పేటలో 50 మంది వలప కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.వికారాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అనాథశ్రామంలో పండ్ల పంపిణీ శారు.
రంగల్ అర్బన్ జిల్లాలో..మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మాంగళ్య షాపింగ్‌మాల్ ఆధ్వర్యంలో హన్మకొండలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి ప్రారంభించారు.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఖిలావరంగల్ ప్రాంతంలో మియావాకి పద్ధతిలో మొక్కలు నాటారు. అనంతరం బాలల సదనంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి కుడా కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి మంత్రి వరంగల్ చౌరస్తాలో కేక్ కట్ చేసి మాస్కులు పంపిణీ చేశారు.
టీఆర్ఎస్ నాయకులు వద్దిరాజు రవిచంద్ర అభిమాన సంఘం నాయకులు కిరణ్ సినిమా థియేటర్ కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. కార్పొరేటర్ జోరిక రమేశ్‌తోపాటు మరో 25 మంది పార్టీ శ్రేణులు జీవన్ దాన్ సంస్థ ఆధ్వర్యంలో నిమ్స్ దవాఖానకు అవయవదాన అంగీకర పత్రాలను అందజేశారు. కార్పొరేటర్లు తమ తమ డివిజన్లలో కేక్ కట్ చేసి మొక్కలు నాటి పండ్లు పంపిణీ చేశారు. పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు.
వరంగల్ రూరల్ జిల్లా..పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మొక్కలు నాటారు. సంగెం మండలంలోని పోచమ్మతండాలో నాలుగేళ్ల చిన్నారి బానోతు దీక్షిత కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కను నాటారు. శాయంపేట మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మొక్కను నాటారు. అనంతరం పీహెచ్సీలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మొక్కలను నాటారు.
నల్లబెల్లి మండలంలో జెడ్పీఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ ఊడుగుల సునీతల ఆధ్వర్యంలో వేడుకలునిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు.
మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మొక్కలు నాటి, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మరిపెడ మండలంలోని ఎల్లంపేటలో పల్లె ప్రకృతి వనంలో డోర్నకల ఎమ్మెల్యే రెడ్యానాయక్ మొక్కలు నాటారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మొక్కలు నాటారు.
జనగామ జిల్లాలో..పాలకుర్తి మండలంలోని బొమ్మెర గ్రామంలో పోతన సమాధి వద్ద పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మొక్కలు నాటారు. ‘రామన్నకు హరితహారం’ పేరిట లక్ష మొక్కలు నాటాలనే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు లక్ష మొక్కలు నాటాయి. జనగామ పట్టణం, బచ్చన్నపేట మండలంలోని గోపాల్‌నగర్, మన్సాన్పల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపణీ చేశారు.