మంత్రి కేటీఆర్ బర్త్ డే…గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి అనూహ్య స్పందన

248
talasani saikiran
- Advertisement -

మంత్రి తారక రామారావు జన్మదినం సందర్భంగా చేపట్టిన #GiftASmile కార్యక్రమం ద్వారా వేలాది మందికి ఏదో ఒక రకమైన సహాయం అందినట్లు అయింది. మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని వేలాది మంది ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయకులు, కార్యకర్తలు తమకు తోచిన విధంగా పలువురికి సహాయం అందిస్తూ దానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా ఇతర సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. దీంతో ట్విట్టర్ లో #GiftASmile హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఇతర ప్రకటనలకు సంబంధించిన ఖర్చు చేయకుండా ఆపదలో ఉన్న వారినీ ఆదుకోవాలని ఇచ్చిన గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమం ఈరోజు విజయవంతమైంది. ఆయా అంశాల పైన చేసే ఖర్చులు తమకు తోచిన విధంగా ఆపన్నులకు సహాయ హస్తం అందించేందుకు ఉపయోగించారు.

ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న కరుణ సంక్షోభం సందర్భంగా మంత్రి అభిమానులు చేపట్టిన గిఫ్ట్ ఏ స్మైల్ ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి సహకారం అందింది.గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం సందర్భంగా పలువురు చేసిన కార్యక్రమాల్లో కొన్ని:

 
• తలసాని సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో తలసాని ఫౌండేషన్ సుమారు 20 కోట్ల కవరేజ్ అందించే లక్ష్యంతో వెయ్యి మంది ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఆరోగ్య బీమా అందించడం జరిగింది

• ఇదే విధంగా ఎమ్మెల్సీ నవీన్ రావు సుమారు 10 లక్షల రూపాయలతో శివానంద రిహాబిలిటేషన్ హోమ్ కి సహాయం అందించారు

•  చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు దీంతో పాటు పలువురికి నిత్యవసర వస్తువులను అందించారు

 •  జవహర్ నగర్ కార్పొరేషన్ చైర్మన్ కావ్య పలువురికి కావలసిన పుస్తకాలను మురికివాడల్లోని పిల్లలకు అందించారు

•  టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వై సతీష్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు సామర్ల మొగిలి కి కొంత ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆయన కొడుకు విద్యకు అవసరమైన సహాయం మరియు కృత్రిమ పాదానికి సంబంధించిన ఖర్చుకు హామీ ఇచ్చారు

•  జిహెచ్ఎంసి కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి తన డివిజన్లోని అనాధ ఆశ్రమానికి కావలసిన నిత్యావసర సరుకులను అందించారు

•  టిఆర్ఎస్ నాయకులు మన్నె కృ శంక్ 102 వలస కుటుంబాలకి వర్షాకాలం అవసరమైన దుప్పట్లను అందించారు. దీంతోపాటు విటమిన్ సి టాబ్లెట్ లు శానిటైజర్ లు వంటి వాటిని కంటోన్మెంట్ ఏరియా లోని పారిశుద్ధ్య కార్మికులకు అందించారు.

ఇలా వేలాది మంది మంత్రి కే తారకరామారావు పుట్టిన రోజు సందర్భంగా తమకు తోచిన మేర పరులకు సహాయం అందించారు.

- Advertisement -