కేటీఆర్‌ బర్త్ డే…గిఫ్ట్ ఏ స్మైల్‌ కార్యక్రమం:బొంతు

225
bonthu rammohan
- Advertisement -

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ ఒకరికొకరు తోడు గా ముందుకు నడవాలి భయం విడిచి కర్తవ్యం నిర్దేశించుకుని సాగాలన్నారు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌.

సీఎం కేసీఆర్, కేటీఆర్ ల నేతృత్వం లో తెలంగాణ రాష్ట్రం కరోనాని సమర్థంగా ఎదుర్కొంటున్నది. కేటీఆర్ కరోనా పై యుద్ధంతో పాటు, నగరాభివృద్ధి పనులు శరవేగంతో ఉరికిస్తున్నారు. ప్రజలకు ఆయన చిరునవ్వులు బహూకరిస్తున్నరు.. ఆయన స్ఫూర్తి తోనే అందరూ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టాలి…తోటి వారి ముఖాల్లో చిరునవ్వులు వెలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.

జులై 24 న మన కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కు పిలుపునిచ్చిన బొంతు రాంమోహన్ ఇబ్బందిలో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి ఆసరాగా ఉందాం. పుట్టినరోజున పూల బోకేలు, శాలువాలు, పత్రికా ప్రకటనలు, హోర్డింగుల మీద డబ్బు ఖర్చు చేయకుండా సాటి మనిషికి సాయపడదాం. వస్తు రూపంలో గానీ, ధన రూపంలో గానీ పేద ప్రజలకు అవసరాలు తీర్చాలన్నారు.

సహాయ కార్యక్రమాలను ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్ లలో ఫొటోలు, వివరాలు పోస్ట్ చేస్తూ కేటీఆర్ గారి సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ట్యాగ్ చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఈ కోవిడ్ సమయంలో చిరునవ్వులు కానుకగా ఇవ్వడమే మన నాయకుడికి నిజమైన జన్మదిన శుభాకాంక్షలు అందించినట్టని తెలిపారు మేయర్ బొంతు.

- Advertisement -