నాకు ఎలాంటి ట్విట్టర్ అకౌంట్ లేదు: అలీ

240
ali
- Advertisement -

తనకు ఎలాంటి ట్విట్టర్ అకౌంట్ లేదని తెలిపారు సినీనటుడు అలీ. తన పేరుతో కొంతమంది ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తున్నారని వారిపై పోలీసులకు ఫిర్యాదుచేయాలని తెలిపారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేసిన అలీ…వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

దాదాపు పదకొండు వందల సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాను కానీ కొంతమంది తనపేరును కావాలనే ఖరాబు చేస్తున్నారని మండిపడ్డారు. తన ప్రమేయం లేకుండా చేస్తున్న పోస్టులకు తనకు ఎలాంటి సంబంధంలేదన్నారు.

తాను వైసీపీలో కీలకంగా ఉన్నానని ఈ పోస్టుల వల్ల పార్టీకి, సీఎం జగన్‌కి ఎలాంటి ఇబ్బంది కలకుండా ఉండటం కోసమే కంప్లైంట్ చేశానని వెల్లడించారు. ఫేక్‌ ఎకౌంట్‌లో వాళ్లు రాసిన న్యూస్‌ కన్నా అది నేనే పెట్టాననుకొని ఆ హీరోల ఫ్యాన్స్‌ చేసే కామెంట్స్‌ చూస్తుంటే నాకు, నా కుటుంబానికి ఎంతో భాద కలుగుతుందన్నారు.

- Advertisement -