ఇస్మార్ట్‌ శంకర్‌కు ఏడాది..పూరీ ఎమోషనల్ ట్వీట్!

192
ismart shanker
- Advertisement -

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్‌. కొంతకాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న పూరి జగన్నాథ్-రామ్‌లకు ఈ మూవీ మంచి బ్రేక్ ఇవ్వగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది.

ముఖ్యంగా తెలంగాణ యాసలో రామ్‌ చెప్పిన డైలాగులు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదలై నేటికి సరిగ్గా ఏడాది. ఈ సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు దర్శకుడు పూరి.

ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన పూరి…ఇస్మార్ట్‌శంకర్‌ అందించిన విజయంతో నా జీవితంలో నేను తిరిగి శక్తిని పొందాను. నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు గాను హీరో రామ్‌కు కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. నిన్ను కలుసుకొని గట్టిగా కౌలిగించుకొని థ్యాంక్స్‌చెప్పాలని ఉంది. నువ్వు తురుం రా అంటూ రామ్‌పై ప్రశంసలు గుప్పించారు.

- Advertisement -