హరే కృష్ణ మూమెంట్,అక్షయపాత్ర ఫౌండేషన్ వారి సౌజన్యంతో బొగ్గుల కుంట లోని తెలంగాణ సారస్వత పరిషత్ యందు100 మంది బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.వి.రమణా చారి, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ,గచ్చిబౌలి కార్పొరేటర్ సాయిబాబ తదితరులు పాల్గొన్నారు.
తాము కోరిన వెంటనే హరికృష్ణ మూమెంట్ , అక్షయ పాత్ర వాళ్ళు 100 మందికి సరిపడా నిత్యావసరాలు పంపించారని తెలిపారు స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి.భగవంతుని ఆశీర్వాదంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం..బ్రాహ్మణులకు నాకు తోచినంత ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటా అన్నారు.లాంటి కార్యక్రమాలు చేయడం నాఅదృష్టం..బ్రాహ్మణులకు సేవ చేయడమంటే ఆ దేవునికి చేసినట్టే అన్నారు.
ఈకార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని కార్పొరేటర్ సాయిబాబా.ఇది మా వంతుగ ఉడత భక్తిగా చేస్తున్న సాయం..ఇది చాలా చిన్న కార్యక్రమము..
మనం అందరం కలిసి ఈ కరోనా మహమ్మరిని తరిమికొడుదాం..అందరం జాగ్రత్తలు పాటించి ఈ వైరస్ ను రాకుండా అడ్డుకట్ట వేద్దాం అన్నారు.
ఈరోజు కార్యక్రమం తలపెట్టిన వెంకటేశ్వర రెడ్డి కి ,సాయిబాబా కు అభినందనలు తెలిపారు ప్రభుత్వ సలహాదారు కేవి రమణాచారి.బ్రాహ్మణులు లోకా సమస్త సుఖినోభవంతు అని ఎలాంటి స్వార్థం లేకుండా పరుల కోసం జీవిస్తారు…ఈ కరోనా మహమ్మరి త్వరగా పారిపోవాలని ప్రార్థిద్దాం అన్నారు.ఈ సహాయం చాలా చిన్నది అందరూ ఈ సంభావన తీసుకోవాలి..దైవం మానుష్య రూపేణా భగవంతుడు ఎక్కడో లేడు ఇలాంటి వారి రూపములో ఉంటాడు..వీరు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలన్నారు.