- Advertisement -
సెక్రటేరియట్ పాత భవనాల కూల్చివేత, కొత్త భవన సముదాయం నిర్మాణాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.సెక్రటేరియట్ నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయం… అందులో న్యాయస్థానం జోక్యం చేసుకోదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
పిటీషన్ ను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ తో కూడిన త్రిసభ్య ధర్మసనం.…ఇప్పటికే హైకోర్టు సమగ్ర విచారణ జరిపినట్లు అభిప్రాయపడింది సర్వోన్నత న్యాయస్థానం.హైకోర్టు పిటిషనర్ అభ్యర్థనలను తిరస్కరించిదన్న న్యాయస్థానం.ఆర్టికల్ 136 ప్రకారం ఈ అంశంలో జోక్యం చేసుకోబోమని వెల్లడించింది.హై కోర్ట్ ఆర్డర్ లో జోక్యం చేసుకోలేమని తెలిపింది.
- Advertisement -