మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కృషితో కువైట్ నుండి హైదరాబాద్ కు చేరారు తెలంగాణ వాసులు. భారీ విమానం బోయింగ్-777 ద్వారా హైదరాబాద్ చేరారు 320 మంది తెలంగాణ యువకులు. కువైట్ లో ఉన్న తెలంగాణ వాసులకు అండగా నిలిచి చార్టెడ్ విమానం ఏర్పాటు చేసింది కువైట్ తెలంగాణ జాగృతి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచనల మేరకు కరోనా కారణంగా కువైట్ లో ఉపాధి కోల్పోయి , అనారోగ్య కారణాల వల్ల, వీసా గడువు ముగిసి అదే సమయంలో లాక్ డౌన్ వల్ల ఇక్కడ ఇరుక్కు పోయి ఇబ్బంది పడుతున్న 320 మందిని తెలంగాణ కు తరలించారు. భారీ విమానం బోయింగ్-777 లో వీరంతా హైదరాబాదు చేరుకున్నారు.
కోవిడ్ నేపథ్యంలో ఇంత పెద్ద విమానం గల్ఫ్ దేశాల నుండి భారత్ రావడంలో ఇది రెండవది. అలాగే వచ్చిన వారిలో అర్హులైన కార్మిక సోదరు లకు తెలంగాణా ప్రభుత్వ సహాకారంతో ఉచిత క్వారంటేన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కువైట్ తెలంగాణ జాగృతి అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్ మాట్లాడుతూ చార్టర్ విమానం అప్రూవల్ తీసుకోవడం లో ప్రత్యేక చొరవ చూపీన మాజీ ఏం.పీలు కల్వకుంట్ల కవిత, వినోద్ కుమార్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జాగృతి నాయకులు చెల్లంశెట్టి హరిప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ లోని తెలంగాణ కార్మికులను స్వదేశం పంపడంలో గత కోన్ని వారాలుగా శ్రమించి ఏర్పాట్లు చేసిన తెలంగాణ జాగృతి కువైట్ జనరల్ సెక్రెటరి మార్కా ప్రమోద్ కుమార్, జాయింట్ సెక్రెటరి మొహమ్మద్ సైఫుద్దీన్, వారం రాజశేఖర్ సభ్యులు లావన్ కుమార్, గుర్రం కిరణ్, గంగాధర్ లను కల్వకుంట్ల కవిత అభినందించారు.