వందల కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడిపై కేసు నమోదుచేసింది సీబీఐ. దాదాపు రూ. 805 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదుచేసిన సీబీఐ…. 2012-2018 మధ్య ప్రజా ఖజానాకు నష్టాన్ని కలిగించారని పేర్కొంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ సంజయ్ రెడ్డితో పాటు తొమ్మిది మంది ప్రైవేట్ సంస్థల అధికారులను ఈ కేసులో చేర్చింది.
సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్- జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది.ఇందుకోసం మియాల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
2017-18లో 9 కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించి.. రూ.310 కోట్లు దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది.. ఇక, జీవీకే గ్రూప్ ప్రమోటర్లు తమ గ్రూప్ కంపెనీలకు ఆర్థిక సహాయం చేసేందుకు మియాల్ రిజర్వు ఫండ్ రూ.395 కోట్లను దుర్వినియోగం చేశారని ఆరోపించింది సీబీఐ.