యూత్ ను ఆకట్టుకునే సినిమాలు చేస్తూ లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో ఉదయ్ కిరణ్. చిత్రం, మనసంతా నువ్వే, నువ్వు నేను, కలుసుకోవాలని, నీకు నేను నాకు నువ్వు సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో పాటు నువ్వునేను సినిమాకు గాను 2001లో ఫిలింఫేర్ ఉత్తమ కథనాయకుడుగా అవార్డు అందుకున్నాడు. ఉదయ్ కిరణ్ దర్శకుడు తేజతో మూడు సినిమాలు తీయగా, వీఎన్ ఆదిత్యతో కూడా మూడు సినిమాలు తీశాడు. నేడు ఉదయ్ కిరణ్ 40వ జయంతి సందర్భంగా ఆయన నటించిన సినిమాల గురించి చూద్దాం.
ఉదయ్ కిరణ్ మొదటగా 2000సవత్సరంలో చిత్రం సినిమాలో నటించాడు. ఆ తర్వాత 2001లో నువ్వునేను, మనసంతా నువ్వే సినిమాలు భారీ విజయం సాధించాయి.ఈసినిమాలు ఉదయ్ కిరణ్ మంచి పేరును తీసుకువచ్చాయి. ఉదయ్ కిరణ్ మొత్తం 22 సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత కలుసుకోవాలని, శ్రీరామ్, హోళీ, నీ స్నేహం, జోడీ నం1, నీకు నేను నాకు నువ్వు, లవ్ టుడే, ఔనన్నా కాదన్నా, పోయి, వియ్యాలవారి కయ్యాలు, వంబు సందయి, గుండె ఝల్లుమంది, ఏకలవ్వుడు , పెన్ సింగం, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా, దిల్ కబాడీ, ఈ పెద్దోళ్లున్నారే, జైశ్రీరామ్, ఇక చివరగా చిత్రం చెప్పిన కథ సినిమాలో నటించాడు. ఈమూవీ ఇంకా విడుదలకు నోచుకోలేదు.