- Advertisement -
ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ వచ్చింది. కర్నూల్ జిల్లాలో కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
వృత్తిరీత్యా ఆయన డాక్టర్ కావడంతో ఆయనతో కాంటాక్ట్ అయిన వారందరిలో ఇప్పుడు టెన్షన్ నెలకొంది.
అమరావతిలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన ఆయన కరోనా టెస్టు చేసుకోగా నెగిటివ్ వచ్చింది. సమావేశాలు ముగిసిన తర్వాత కోడుమూరు వచ్చాక ఆయనలో కరోనా లక్షణాలు కనిపించగా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.
దీంతో ఆయన హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఆయనను ఎవరెవరు కలిశారు ? కరోనా ఎలా సోకింది? అనే విషయాల్ని ఆరా తీస్తున్నారు అధికారులు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆయన గన్‌మెన్‌లను వెనక్కి పంపించారు సుధాకర్.
- Advertisement -