భూమా అఖిల ప్రియ …ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. తండ్రి భూమా నాగిరెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన అఖిలప్రియ టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన అఖిలప్రియ త్వరలో కొత్త అవతారం ఎత్తనున్నారు.
తన భర్త భార్గవ్‌తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. తన స్వంత బ్యానర్‌ను ప్రారంభించడంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారట అఖిల ప్రియ. ఇందుకు సంబంధించి అఫిషియల్ అనన్స్ మెంట్ త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం..ఆ తర్వాత సినిమా షూటింగ్స్‌కు బ్రేక్ పడటంతో పెద్ద నిర్మాతలే తాము పెట్టుబడులు పెట్టిన సినిమాల పరిస్థితిపై సందిగ్ధంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో భూమా అఖిలప్రియ చిత్రనిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తున్నారనే వార్త టీ టౌన్లో హాట్ టాపిక్‌గా మారింది.