కరోనా వ్యాప్తి నేపథ్యంలో హజ్ యాత్ర 2020 ను రద్దు చేస్తున్నాం..సెంట్రల్ హజ్ కమిటీ నుండి ఇచ్చిన రూల్స్‌ను అమలు పరుస్తామని తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ మసియుల్లాఖాన్ తెలిపారు.నేడు హైదరాబాద్ హజ్ హౌజ్‌లో తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ మసియుల్లాఖాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హజ్ యాత్ర 2020కు సెలెక్ట్ అయిన వారి అమౌంట్ తిరిగి ఇస్తామని..నెల రోజుల్లో అవి రిఫండ్ అవుతాయన్నారు.ఎవరైన ఇబ్బంది ఉంటే హజ్ హౌజ్‌కి వచ్చి డౌట్ క్లియర్ చేసుకోగలరని తెలిపారు.
పాస్పోర్ట్ కూడా వన్ మంత్‌లో ఇవ్వబడుతాయి. కరోనా వైరస్ త్వరగా అంతమవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్దిద్దాం.ఈ ఏడాది హజ్ యాత్ర కోసం ఐదువేల మందిని ఎంపిక చేశామన్నారు. వచ్చే ఏడాది యాత్రకు వెళ్లే వారితోపాటు ఈ ఐదువేల మందిని కూడా పంపేలా చర్యలు తీసుకోవడంపై దృష్టిసారిస్తామని హజ్ కమిటీ చైర్మన్ మసియుల్లాఖాన్ పేర్కొన్నారు.