మొక్కలు నాటిన నల్లగొండ ఎస్పీ రంగనాధ్..

433
Nalgonda SP Ranganath
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ప్రారంభించిన మూడవ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ మొక్కలు నాటారు. ఆయన ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో అదనపు ఎస్పీ డిటిసి సతీష్ చోడగిరి, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, రమణారెడ్డిలతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని అన్నారు. మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందడంతో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గి మానవాళి మనుగడలో కీలకపాత్ర వహిస్తాయని చెప్పారు.జిల్లా పోలీసు కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఆవరణలో పచ్చదనం పెంపొందించేలా విస్తృతంగా మొక్కలు నాటుతున్నామని చెప్పారు.

మంత్రి జగదీష్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన ఆయన నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి, సైబరాబాద్ సిపి వి.సి. సజ్జనార్, మెదక్ ఎస్పీ చందనా దీప్తి లకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ.లు వై.వి. ప్రతాప్, నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, సిఐలు బాషా, నాగేశ్వరరావు, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -