కొంతకాలంగా వైసీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షాకిచ్చారు సీఎం వైఎస్ జగన్. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేశారు. వారం రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు జగన్. దీంతో ఇప్పుడు ఈ వార్త ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.
కొంతకాలంగా నియోజకవర్గ సమస్యల కోసం సీఎం వైఎస్ జగన్ అపాయింట్ మెంట్ కోసం ఎన్నో సార్లు ప్రయత్నించారు ఎంపీ రఘురామ. అయితే జగన్ ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో జగన్ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదంటూ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. జగన్ ఏడాది పాలనపై ఘాటుగానే వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో రఘురామపై సొంతపార్టీ నేతలు తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు దీంతో తనకు ప్రాణభయం ఉందని కేంద్రబలగాలతో రక్షణ కల్పించాలని స్పీకర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది వైసీపీ అధిష్టానం.